
Janasena: జనసేన పార్టీ కి ట్విట్టర్‌లో మిలియన్ 10 లక్షల ఫాలోవర్లు దాటడంపై పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రంలోనే ట్విట్టర్‌లో మిలియన్ మార్క్ దాటిన ఏకైక ప్రాంతీయ పార్టీ జనసేనే అని కొనియాడారు.
జనసేన పార్టీ అరుదైన ఘనతకు కొలువు గా నిలిచింది . దక్షిణ భారతదేశంలో ఎన్నో ఏళ్లుగా స్థిరపడి ఉన్నా ప్రాంతీయ పార్టీలు పొందలేని ఘనతను సాధించింది. ట్విట్టర్‌లో (సోషల్ మీడియా మాధ్యమం) మిలియన్ ( అనగా 10 లక్షల) మంది ఫాలోవర్లను సాధించింది.
దక్షిణాదిలో ఏ ప్రాంతీయ పార్టీ సాధించలేని ఘనతను జనసేన పొందిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఆయన వరుస ట్వీట్లు చేశారు.
‘‘మిలియన్ ఫాలోవర్లను సాధించిన జనసేన పార్టీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అని . పార్టీ కోసం ఎంతగానో కష్టపడుతున్న జనసేన ట్విట్టర్ నిర్వహణ సిబ్భంది కి శుభాభినందనలు. ఈ లాక్ డౌన్ ముగిసిన తర్వాత మీ అందరినీ ఓ సారి కలుస్తాను.’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
‘‘ట్విట్టర్‌లో 10 లక్షల మంది జనసైనికులయ్యారు. దక్షిణ భారతదేశంలోనే మిలియన్ మార్క్ చేరిన ఏకైక ప్రాంతీయ పార్టీ Janasena అని తెలిసింది. ఇందుకు జనసేన శతఘ్ని టీంకు, సోషల్ మీడియలో ఉన్న ప్రతి సైనికుడికి పేరుపేరునా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దేశం గర్వించేలా ఈ ఆర్మీని నిర్మిద్దాం’’ అని పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. కాగా, ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ట్విట్టర్ ఫాలోవర్లు 5.60 లక్షల మంది ఉండగా, టీడీపీకి 3.96 లక్షల మంది ఉన్నారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ట్విట్టర్‌లో 4.31 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ, గత ఎన్నికల్లో కేవలం ఒక్క ఎమ్మెల్యే స్థానం పొందిన జనసేన పార్టీ మాత్రం 10 లక్షల మంది ఫాలోవర్లను కలిగి ఉండటం విశేషం.
మరిన్ని క్రొత్త విషయాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Telugu News
Leave a Reply