Bharathi Bharathi Uyyalo Lyrics in Telugu – Razakar Songs
Song Lyrics Details:
Movie | Razakar Telugu |
Singer | Bheems, Mohana Bhogaraju, Spoorthi Jithendar |
Director | Yata Satyanarayana |
Music | Bheems Ceciroleo |
Song Writer | Kasarla Shyam |
Bharathi Bharathi Uyyalo Lyrics in Telugu
భారతి భారతి ఉయ్యాలో
బంగారు భారతి ఉయ్యాలో
(భారతి భారతి ఉయ్యాలో
బంగారు భారతి ఉయ్యాలో)
సూడమ్మ మా గతి ఉయ్యాలో
నీకు బతుకమ్మ హారతి ఉయ్యాలో
(సూడమ్మ మా గతి ఉయ్యాలో
నీకు బతుకమ్మ హారతి ఉయ్యాలో)
ఈ గునుగు పూలతో ఉయ్యాలో
మా గోడు సెప్పినముయ్యాలో
(ఈ గునుగు పూలతో ఉయ్యాలో
మా దేవుడు సెప్పినముయ్యాలో)
ఈ కట్లపూలతో ఉయ్యాలో
మా గోస పరిసినం ఉయ్యాలో
సీతజడ పూలతో ఉయ్యాలో
మా రాత చదివినం ఉయ్యాలో
మా కొంగు తడవంగ
కండ్లల్ల పెనుగంగా
కంటికి మింటికి దార కట్టిందమ్మ
భారతి భారతి ఉయ్యాలో
బంగారు భారతి ఉయ్యాలో
మా పల్లె తెల్లారే, ఆ బూట్ల సప్పుళ్ళ
మా గల్లి బరువాయే గుర్రాల డెక్కల్ల
ఒల్లంతా వాతలే, లాఠీల దెబ్బల్ల
తాకితే రక్తాలే తుఫాకి డొక్కల్ల
.
ఆ కోడి పిల్లల్ల ఉరికేటి జనాలు
గద్ధోలె ఎత్తుకొని పోయేరు పాణాలు
రజాకార్లు చేసే నెత్తుటి తానాలు
సింపినిస్తారాకులై పోయే మానాలు
రికామంటూ లేదు ఉయ్యాల
ఆల్ల మీద మన్ను బొయ్య ఉయ్యాలో
(రికామంటూ లేదు ఉయ్యాల
ఆల్ల మీద మన్ను బొయ్య ఉయ్యాలో)
ఆ నిజామోన్ని తెచ్చి ఉయ్యాలో
ఈడ ఎల్లాడ దియ్యాలే ఉయ్యాలో
(ఆ నిజామోన్ని తెచ్చి ఉయ్యాలో
ఈడ ఎల్లాడ దియ్యాలే ఉయ్యాలో)
ఓ, సంపుకుంట పోతే ఎన్నాళ్లిట్ల
నోరు మూసుకొని ఉందాము ఇంట్ల
బిడ్డ గొడ్డు మెతుకు అడ్డమైన బతుకు
గంప సెట్ల మీద బట్ట ఏసినట్టు
గుంజు గుంజుతుంటే ఈడ ఉండుడెట్లు
ఉడకాలే ఉడకాలే ఉయ్యాలో
వాడు ఉరకాలే ఉరకాలే ఉయ్యాలో
(ఉడకాలే ఉడకాలే ఉయ్యాలో
వాడు ఉరకాలే ఉరకాలే ఉయ్యాలో)
ఆ మరక కొడుకుల్ని ఉయ్యాలో
ఊరు నడిమిట్ల నరకాలే ఉయ్యాలో
(ఆ మరక కొడుకుల్ని ఉయ్యాలో
ఊరు నడిమిట్ల నరకాలే ఉయ్యాలో)
ఊళ్లకొత్తే మన వంక సూత్తే
సేను కాడ కాపు కాసి వడిసెల్లా రాళ్లేసి
పిట్టలెక్క వాని ఇగ్గి కొట్టాలె
కంది పొరకతోటి కములగొట్టాలె
దొడ్డు దొడ్డు గుత్పలందుకొని
వాని నడ్డి ఇరగ తంతే బొక్కలిరగాలే
మంద జూస్తే కొడుకు ఉచ్చ బొయ్యాలె
బొంద దవ్వి ఉప్పు పాతరెయ్యాలే
కారపు నీళ్లెత్తి కండ్లల్లనే జల్లి
ఎండు మిరపకాయ ముంత పొగలు బెట్టి
రోకలి బండెత్తి సాకలి బండ మీదా
తలపండు పగలంగ ఇయ్యర మయ్యర దంచి
రజాకారులను ఉయ్యాలో
రవుతులందుకొని ఉయ్యాలో
రజాకారులను ఉయ్యాలో
రవుతులందుకొని ఉయ్యాలో
తన్ని తన్ని తరిమెయ్యాల
ఆని ఇంట్ల పీనుగెల్ల ఉయ్యాలో
తన్ని తన్ని తరిమెయ్యాల
ఆని ఇంట్ల పీనుగెల్ల ఉయ్యాలో
Watch and Enjoy భారతి భారతి ఉయ్యాలో Lyrical Video Song
Click Here for LATEST SONG LYRICS
Leave a Reply